
నేరడిగొండ, వెలుగు: పర్యావరణాన్ని పరిరక్షించేందుకు నేరడిగొండ మండలంలో నేషనల్ హైవేకు ఇరువైపులా నాటిన మొక్కలు పెరిగి వృక్షాలుగా మారాయి. అయితే కొందరు నిర్లక్ష్యంగా అక్కడ నిప్పుపెట్టడంతో ఆ చెట్లు కాలిపోయాయి. ఆహ్లాదాన్ని పంచాల్సిన చెట్లు బుగ్గి పాలవ్వడంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఫీసర్లు స్పందించి సంరక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.